Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ రద్దు

YSRCP MLC Anantha Babu bail petition rejected
  • మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు
  • బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన ఎస్సీ, ఎస్టీ కోర్టు
  • బెయిల్ మంజూరు చేయడానికి సరైన కారణాలు చూపలేదన్న కోర్టు
మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన బహిష్కృత వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేయడానికి నిందితుడి తరపు న్యాయవాది సరైన కారణాలు చూపనందువల్ల బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తున్నట్టు కోర్టు తెలిపింది. 

మరోవైపు ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు స్పందిస్తూ బాధితుల తరపున వేసిన కౌంటర్ పిటిషన్ లోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు బెయిల్ పిటిషన్ రద్దు చేసిందని చెప్పారు. అనంతబాబు బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అంశాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారని అన్నారు.
Anantha Babu
YSRCP
Bail

More Telugu News