Painter: పెయింటర్ ప్రాణాలు తీసిన ఆన్ లైన్ రమ్మీ!

Painter who lost everything in online rummy commits suicide
  • ఆన్ లైన్ రమ్మీలో రూ. 20 లక్షలు కోల్పోయిన నాగరాజు
  • భార్య నగలు అమ్మి, అప్పులు చేసి సర్వం కోల్పోయిన వైనం
  • ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నాగరాజు
ఆన్ లైన్ రమ్మీకి బానిసలైన ఎంతో మంది వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఈ జూదం ఒక పెయింటర్ ప్రాణాలను తీసింది. వివరాల్లోకి వెళ్తే, చెన్నై, మనాలి, అన్నా వీధిలో నాగరాజన్ (37), వరలక్ష్మి అనే భార్యాభర్తలు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెయింటింగ్ కార్మికులను పెట్టుకుని నాగరాజు పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తున్నాడు.

అయితే ఈయన కొన్నాళ్లుగా ఆన్ లైన్ రమ్మీకి బానిస అయ్యాడు. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ వరుసగా డబ్బులు కోల్పోయాడు. అయితే కోల్పోయిన డబ్బులను ఎలాగైనా మళ్లీ సంపాదించాలనే పట్టుదలతో భార్య నగలు తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఆన్ లైన్ రమ్మీ ఆడాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 20 లక్షల వరకు కోల్పోయాడు. 

ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆన్ లైన్ రమ్మీ వద్దని బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి హితవు పలికారు. అయినప్పటికీ రెండు రోజుల క్రితం కూడా తన సెల్ ఫోన్ అమ్మి నాగరాజన్ రమ్మీ ఆడి, ఈ డబ్బు కూడా కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో నాగరాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ లో తాను చేసిన అప్పుల వివరాలను రాశాడు. రమ్మీకి బానిసగా మారి ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు.
Painter
Online Rummy
Suicide

More Telugu News