womens safety: మాజీ ప్రేయసి చేయి లాగినందుకు ఏడాది జైలు శిక్ష... ఎక్కడంటే..!

Man gets one year jaill sentence for pulling his former girl friend hand
  • రూ. 5 వేల జరిమానా కూడా
  • ముంబైలో 2014లో ఘటన
  • నిందితుడికి పెళ్లి కావడంతో సాధారణ శిక్ష విధించిన కోర్టు
ఎనిమిదేళ్ల కిందట తన మాజీ ప్రియురాలి చేయి లాగినందుకు ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళకు ఇష్టం లేకుండా ఆమె చేయిపట్టుకోవడం, దగ్గరికి లాగడాన్ని ఆమె పరువుకు భంగం కలిగించిన నేరంగా పరిగణించిన ముంబై మెట్రోపాలిటన్ కోర్టు 28 ఏళ్ల ఆ వ్యక్తికి శిక్ష ఖరారు చేసింది. ఏడాది  సాధారణ జైలు శిక్షతో పాటు రూ. ఐదు వేల జరిమానా విధించింది. 

2014లో నమోదైన  ఈ కేసును విచారించి, తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.  మాజీ ప్రేయసి చేయిపట్టుకోవడం నేరంగా పరిగణించకూడదని నిందితుడు చేసిన వాదనను కొట్టి పారేశారు. అలాగే, కేసు నమోదైన తర్వాత నిందితుడి సత్ర్పవర్త చూసి అతడిని వదిలేయలేమని చెప్పారు. 

అయితే ఘటన జరిగి ఎనిమిదేళ్లు కావడం, ఈ సమయంలో నిందితుడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా కలగడంతో మానవతా దృక్పథంతో అతనికి కఠిన శిక్ష వేయడం లేదని న్యాయమూర్తి తెలిపారు. 


womens safety
jail
mumbai
court
man
girl friend

More Telugu News