Secunderabad: 'అగ్నిపథ్' నిరసనలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. వీడియో ఇదిగో!

train set ablaze in Secunderabad by agitators who are protesting against Agnipath scheme
  • 'అగ్నిపథ్' పథకంపై దేశంలో పలుచోట్ల నిరసనలు
  •  సికింద్రాబాద్ స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
  • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల సర్వీస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆందోళన కార్యక్రమాలు హింసాత్మక రూపు దాలుస్తున్నాయి. పలు చోట్లు ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. 

ఇప్పుడీ సెగ హైదరాబాదుకు కూడా పాకింది. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొందరు యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిప్పుపెట్టారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Secunderabad
Train
Hyderabad
Agnipath

More Telugu News