రాంగోపాల్ వర్మ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి!

16-06-2022 Thu 14:13 | Entertainment
  • కొండా దంపతుల జీవితకథతో తెరకెక్కిన 'కొండా' చిత్రం
  • ఈ నెల 18న వరంగల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 23న విడుదల కానున్న 'కొండా'
Revanth Reddy is chief guest for RGVs Konda movie pre release event
కొండా మురళి, కొండా సురేఖల జీవిత కథతో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'కొండా'. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న వరంగల్ లో జరగనుంది. ఖుష్ మహల్ గ్రౌండ్ లో 18న సాయంత్రం 6.30 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. 

ఈ ఈవెంట్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ విషయన్ని ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు వస్తున్న తన మిత్రుడు, తెలంగాణ సింహం రేవంత్ రెడ్డికి 'కొండా' సినిమా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.