Mumbai: 35 ఏళ్ల మేనకోడలిపై 75 ఏళ్ల వ్యాపారి అత్యాచారం.. ముంబైలో కేసు నమోదు

Mumbai Writer Raped In 5 Star Warned By D Gang To Remain Quiet
  • జుహూలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగినట్టు బాధితురాలి ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరించినట్టు వెల్లడి
  • డీగ్యాంగ్ నుంచి కాల్స్ వచ్చాయని పోలీసులకు సమాచారం
ముంబైలో తన మేనకోడలిపై వృద్ధ వ్యాపారి అత్యాచారం చేసిన విషయం వెలుగు చూసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. "75 ఏళ్ల వ్యాపారి జుహూలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో 35 ఏళ్ల మేనకోడలిపై అత్యాచారం చేశాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని పోలీసులు తెలిపారు.

అత్యాచారం చేయడమే కాకుండా పోలీసులకు చెబితే, అంతు చూస్తానంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పేరుతో వ్యాపారి ఆమెను బెదిరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై బాధితురాలు అంబోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామంటూ తనకు డీ గ్యాంగ్ నుంచి కాల్ వచ్చినట్టు కూడా ఆమె చెప్పడం గమనార్హం. మహిళల ఫిర్యాదులను ప్రత్యేకంగా విచారించే ఎంఐడీసీ స్టేషన్ కు ఈ కేసును బదిలీ చేశారు.
Mumbai
Writer
Raped
businessman

More Telugu News