Pegasus: రేప‌టి నుంచి పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ హౌజ్ క‌మిటీ విచార‌ణ‌

ap assembly house committee meet in assembly in amaravati
  • భూమ‌న ఆధ్వ‌ర్యంలో క‌మిటీ ఏర్పాటు
  • టీడీపీ హ‌యాంలో పెగాస‌స్‌ను వాడార‌న్న అంశంపై క‌మిటీ
  • అసెంబ్లీలో స‌మావేశమైన క‌మిటీ స‌భ్యులు
  • రేపు హోం శాఖ స‌హా ప‌లు శాఖ‌ల అధికారుల విచార‌ణ‌
టీడీపీ హ‌యాంలో పెగాస‌స్ నిఘా ప‌రిక‌రాలను వినియోగించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఏర్పాటైన ఏపీ అసెంబ్లీ హౌజ్ క‌మిటీ విచార‌ణ‌లో దూకుడు పెంచింది. విప‌క్ష నేత‌ల క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టేందుకే టీడీపీ ప్రభుత్వం పెగాస‌స్ ప‌రిక‌రాల‌ను వినియోగించిందన్న వార్త‌ల‌పై ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భారీ ర‌చ్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే తామేమీ ఈ ప‌రికరాల‌ను వాడ‌లేద‌ని, అస‌లు వాటిని కొనుగోలే చేయ‌లేద‌ని టీడీపీ వాదించింది. ఈ క్ర‌మంలో ఇందులోని వాస్త‌వాల‌ను నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ హౌజ్ క‌మిటీని నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క‌మిటీ మంగ‌ళ‌వారం అమ‌రావ‌తిలోని అసెంబ్లీలో తొలిసారి భేటీ అయ్యింది. ఈ భేటీలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన క‌మిటీ... రేపు హోం శాఖ స‌హా ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న ప‌లు శాఖ‌ల అధికారుల‌ను విచారించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేరకు ఆయా శాఖ‌ల‌కు క‌మిటీ నుంచి లేఖ‌లు వెళ్లాయి. ఆయా ప్రభుత్వ శాఖ‌ల నుంచి స‌మాచారం సేక‌రించ‌నున్న కమిటీ త‌న నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేయ‌నుంది.
Pegasus
TDP
AP Assembly
Assembly House Committee
Bhumana Karunakar Reddy
YSRCP

More Telugu News