Thalapathy Vijay: విజయ్, రష్మిక షూటింగ్ ఫొటోలు లీక్

Thalapathy Vijay and Rashmika Mandannas pics leaked from Thalapathy 66 shooting
  • హైదరాబాద్ లో విజయ్ 66వ సినిమా షూటింగ్
  • రోడ్డు పక్కనే నర్సరీలో సెట్ వేసి చిత్రీకరణ
  • ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వైనం
  • చిత్రీకరణకు ఫోన్లను అనుమతించకూడదన్న యోచన
తమిళ అగ్ర నటుడు విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న సినిమా షూటింగ్ ఫొటోలు లీకయ్యాయి. ఇవి సామాజిక మాధ్యమాల్లోకి చేరిపోవడంతో దర్శకుడు వంశీ అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ఇకపై షూటింగ్ సమయంలో ఎవరికీ ఫోన్ అనుమతించకూడదన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.

విజయ్ 66వ సినిమా (ఇంకా పేరు నిర్ణయించలేదు) షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రోడ్డు పక్కన నర్సరీలో వేసిన షూటింగ్ సెట్ లో విజయ్ క్యాజు వల్ డ్రెస్ వేర్ లో కనిపించగా.. రష్మిక పొట్టి టాప్ తో వెనుకనే నించున్నట్టు కనిపిస్తోంది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఆసక్తిగా చూస్తున్నారు. 

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ రూపొందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. 

 
Thalapathy Vijay
Rashmika Mandanna
shooting picks
leaked

More Telugu News