Ali: ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే: సినీ నటుడు అలీ

Next time also YSRCP will come into power says Ali
  • మెల్ బోర్న్ లో వైసీపీ మహా గర్జన కార్యక్రమం
  • కార్యక్రమానికి హాజరైన అలీ
  • జగన్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని సినీ నటుడు, వైసీపీ నేత అలీ కొనియాడారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. అవినీతికి తావు లేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను అందించిన ఘనత జగన్ దని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైపీసీనే అని ధీమా వ్యక్తం చేశారు. 

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో వైసీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు హాజరయ్యారు.
Ali
Australia
YSRCP
Jagan

More Telugu News