Prakasam District: ప్రకాశం జిల్లా వైసీపీ నేత ఇంట్లో సీసీఎస్ పోలీసుల తనిఖీలు.. రూ. 25 కోట్ల విలువైన మరకత పంచముఖ వినాయక విగ్రహం స్వాధీనం

CCS Police Searches in Yerragondapalem ycp leaders House and Rs 25 crore worth emerald Panchamukha Vinayaka idol seized
  • ఎర్రగొండపాలెంలోని వై.వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో సోదాలు
  • విగ్రహాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అనుమతులు ఉన్నాయన్న నేత
  • తొలుత అదుపులోకి తీసుకుని ఆపై విడిచిపెట్టిన పోలీసులు

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైంది. అత్యంత అరుదైన ఈ విగ్రహం విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఆయనతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న గోళ్లవిడిపికి చెందిన గ్రామస్థాయి నేత గజ్జెల చెన్నయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ విగ్రహాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అనుమతులు ఉన్నాయని వెంకటేశ్వరరెడ్డి చెప్పడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులను తీసుకురావాలని చెబుతూ వారిని విడిచిపెట్టారు. కాగా, ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్టు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News