Gautam Gambhir: నుపుర్ శర్మకు మద్దతు పలికిన గౌతమ్ గంభీర్

Gambhir came in support for Nupur Sharma
  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ
  • సస్పెండ్ చేసిన బీజేపీ
  • నుపుర్ శర్మకు బెదిరింపులు
  • క్షమాపణలు చెప్పినా ఆమెను వదలడంలేదన్న గంభీర్
ఇటీవల ఓ టీవీ చానల్ డిబేట్ లో మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి బీజేపీ అధికార ప్రతినిధి పదవి నుంచి సస్పెండైన నుపుర్ శర్మ... ప్రస్తుతం బెదిరింపులు, పోలీస్ కేసులు ఎదుర్కొంటూ భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్టు నుపుర్ శర్మ ఇప్పటికే క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, నుపుర్ శర్మకు బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మద్దతు పలికాడు. తాను చేసిన వ్యాఖ్యలకు ఆమె ఇప్పటికే క్షమాపణ కోరిందని, అయినప్పటికీ దేశం నలుమూలల నుంచి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, ఆమె పట్ల విద్వేషం పెల్లుబుకుతోందని వివరించాడు. ఇంత జరుగుతున్నా గానీ లౌకిక ఉదారవాదులుగా చెప్పుకునే వారు మౌనం వహిస్తున్నారని, వారిది మౌనం కాదని, అది కచ్చితంగా చెవిటితనమేనని గంభీర్ విమర్శించారు. ఈ మేరకు గంభీర్ ట్వీట్ చేశారు.
Gautam Gambhir
Nupur Sharma
Prophet
Comments
BJP

More Telugu News