Team India: టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ కు వాన ముప్పు

Rain alert for 2nd T20 between Team India and South Africa
  • కటక్ లో మ్యాచ్
  • వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం
  • ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో నేడు రెండో మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో చేజింగ్ చేసి గెలిచిన ఆత్మవిశ్వాసంతో సఫారీలు మరోసారి లక్ష్యఛేదనకే మొగ్గుచూపినట్టు అర్థమవుతోంది. కాగా, ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న కటక్ లో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. 

కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవని తాత్కాలిక సారథి రిషబ్ పంత్ తెలిపాడు. అటు, చేతి గాయానికి గురైన క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదని, అతడి స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ జట్టులోకి వచ్చాడని దక్షిణాఫ్రికా సారథి టెంబా బవుమా వెల్లడించాడు. యువ ఆటగాడు ట్రిస్టాన్ స్టబ్స్ స్థానంలో హెండ్రిక్స్ ను తీసుకున్నట్టు తెలిపాడు.
Team India
South Africa
Cuttack
2nd T20
Rain
Toss

More Telugu News