Pawan Kalyan: పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కోసం బ్లాక్ స్కార్పియోలతో కొత్త కాన్వాయ్

New convoy vehicles for Pawan Kalyan bus yatra
  • ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్న జనసేన
  • ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్న పార్టీ
  • అక్టోబరు 5 నుంచి పవన్ బస్సు యాత్ర
ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతో జనసేనాని పవన్ కల్యాణ్ అక్టోబరులో బస్సు యాత్ర చేపడుతుండడం తెలిసిందే. అక్టోబరు 5న తిరుపతిలో పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, పవన్ కోసం భారీ కాన్వాయ్ ని సిద్ధం చేస్తున్నారు. 

బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో వాహనాలు జనసేన కార్యాలయంలోకి బారులు తీరి వెళుతున్నట్టు ఓ వీడియోలో కనిపించింది. 2023లో ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే పవన్ కల్యాణ్ దసరా నుంచి ఐదు నెలల పాటు రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
Pawan Kalyan
Convoy
New Vehicles
Mahindra Scorpio
Janasena
Andhra Pradesh

More Telugu News