Chandrababu: మొన్న వెంకాయమ్మపై, ఇప్పుడు ఆమె కుమారుడిపై దాడి చేశారు: చంద్రబాబు

Chandrababu demands police should arrest who attacked on Venkayamma family
  • వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన వెంకాయమ్మ
  • దాడికి గురైన వైనం
  • వెంకాయమ్మ కుటుంబంపై దాడిని ఖండిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడి
ఇటీవల వైసీపీ సర్కారుపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతల చేతిలో దాడికి గురైన వెంకాయమ్మ కుటుంబంపై మరోసారి దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. మొన్న వెంకాయమ్మపై దాడి జరిగిందని, నేడు ఆమె కుమారుడిపై దాడి జరిగిందని తెలిపారు. వెంకాయమ్మ కుటుంబంపై దాడిని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. జగన్ పాలనపై విమర్శలు చేస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. అరాచక శక్తులు దాడులు చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని మండిపడ్డారు. వెంకాయమ్మ కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

వెంకాయమ్మ స్వగ్రామం గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆమెపై దాడి జరగ్గా, టీడీపీ అండగా నిలిచింది. వెంకాయమ్మను ఇటీవల ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడుకు కూడా ఆహ్వానించడం తెలిసిందే.
Chandrababu
Venkayamma
Attack
YSRCP
Police
TDP
Andhra Pradesh

More Telugu News