YSRCP: పరిటాల రవి హత్య కేసు నిందితులు చనిపోయినట్టే.. వివేకా హత్యకేసులోనూ జరుగుతోంది: వర్ల రామయ్య

  • జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ ఉనికి కోల్పోతోందన్న వర్ల రామయ్య
  • వివేకా హత్య కేసు నీరుగారిపోతోందని ఆవేదన
  • పోలీస్ వ్యవస్థను కాపాడాలని డీజీపీ, సీఐడీ చీఫ్‌లకు వినతి
Varla Ramaiah Once again fires on CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోమారు విరుచుకుపడ్డారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు రోజురోజుకు నీరుగారిపోతోందని విమర్శించారు. స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆరోపించారు. 

పరిటాల రవి హత్య కేసులో నిందితులు చనిపోయినట్టుగానే వివేకా హత్యకేసులోనూ జరుగుతోందన్నారు. జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ ఉనికిని కోల్పోతోందని, అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలా తయారైందని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో సీఎం కుటుంబ సభ్యుల హస్తం ఉందని రాష్ట్రం మొత్తం అంటోందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కాపాడాలని ఈ సందర్భంగా డీజీపీ, సీఐడీ చీఫ్‌లను వర్ల రామయ్య కోరారు.

More Telugu News