Google Maps: ఓ ప్రాంతంలో గాలి నాణ్యత తెలుసుకోవాలనుకుంటున్నారా?... గూగుల్ మ్యాప్స్ చూస్తే సరి!

  • నేవిగేషన్ యాప్ గా ఉన్న గూగుల్ మ్యాప్స్
  • కొత్త ప్రదేశాలకు దారిచూపే యాప్
  • ట్రాఫిక్ వివరాలు తెలుసుకునే సదుపాయం
  • తాజాగా కొత్త ఫీచర్
Google maps brings air quality details

కొత్త ప్రదేశాలు, చిరునామాలు వెదికేందుకు, సరైన రీతిలో మార్గదర్శనం చేసేందుకు గూగుల్ మ్యాప్స్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ నేవిగేషన్ యాప్ ద్వారా ట్రాఫిక్ పరిస్థితులు, పార్కింగ్ సదుపాయం వివరాలు తెలుసుకునే సౌలభ్యం కూడా ఉంది. కొత్తగా గూగుల్ మ్యాప్స్ లో మరో ఫీచర్ ను కూడా జోడించారు. యూజర్లు తాము ఉన్న ప్రాంతమే కాకుండా, ఏదైనా కొత్త ప్రాంతంలో గాలి నాణ్యతను తెలుసుకోవాలనుకుంటే ఇకపై గూగుల్ మ్యాప్స్ చూస్తే సరి! 

ఈ ఫీచర్ ను పొందాలంటే గూగుల్ మ్యాప్స్ ను అప్ డేట్ చేసుకోవాలి. లేక, ప్లే స్టోర్ నుంచి గూగుల్ మ్యాప్స్ లేటెస్ట్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 

మొదట... ఫోన్ లేదా ట్యాబ్ లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత... కుడివైపున లేయర్స్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే ఆప్షన్లలో ఎయిర్ క్వాలిటీ లేయర్ ను సెలెక్ట్ చేస్తే సరి... ఆ ప్రాంతంలో గాలి నాణ్యత వివరాలను గూగుల్ వెల్లడిస్తుంది. ఈ ఫీచర్ పై గతేడాదే వెల్లడించిన గూగుల్... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది.

More Telugu News