నుపుర్ శర్మ తల నరుకుతున్నట్టుగా వీడియో... కశ్మీర్ యూట్యూబర్ అరెస్ట్
- మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ
- నుపుర్ ను సస్పెండ్ చేసిన బీజేపీ
- వైరల్ గా మారిన ఫైజల్ వనీ వీడియో
- తీవ్రంగా పరిగణించిన పోలీసులు
దీన్ని తీవ్రంగా పరిగణించిన సఫా కడాయ్ పోలీసులు యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్ట్ చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాడని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ప్రచారం చేస్తున్నాడన్న అభియోగాలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ 505, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాగా, తన వీడియోపై తీవ్ర దుమారం రేగడంతో వనీ ఆ వీడియోను తొలగించాడు. తన అరెస్ట్ కు ముందు మరో వీడియో పోస్టు చేసి క్షమాపణలు కోరాడు. ఏ మతానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు.
.