JIO: చవక ధరల్లో జియో ప్రీపెయిడ్ ప్లాన్లు... రూ.149 నుంచి మొదలు

  • ఇటీవల ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచిన జియో
  • వినియోగదారులకు ఊరట కలిగిస్తూ తాజాగా బడ్జెట్ ప్లాన్లు
  • అన్ లిమిటెడ్ కాలింగ్ తో తాజా ప్లాన్లు
  • రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్ లు
JIO introduces budget prepaid plans

ఇటీవల రీచార్జి ధరలు పెంచిన జియో తాజాగా మూడు చవక ధరల ప్లాన్లు తీసుకువచ్చింది. రూ.149, రూ.179, రూ.209 ధరలతో ఈ ప్లాన్లు ప్రకటించింది. 

వీటిలో రూ.149 ప్లాన్ వివరాలు పరిశీలిస్తే... ఇది 20 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. దీంట్లో అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు, రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. జియో సినిమా, జియో టీవీ వంటి పలు యాప్ లు కూడా ఉచితం.

ఇక రూ.179 ప్లాన్ చూస్తే... ఇది 24 రోజుల కాలపరిమితితో వస్తోంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు పొందవచ్చు. రోజులో 1 జీబీ డేటా వినియోగం పూర్తయితే ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. ఇందులోనూ జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్ లు ఉచితం. 

ఈ శ్రేణిలో మూడో ప్లాన్ రూ.209తో లభ్యమవుతుంది. దీని కాలపరిమితి 28 రోజులు. ఇందులోనూ అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు పొందవచ్చు. ఇది కూడా పలు జియో యాప్ ల సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

More Telugu News