Telangana: స‌బ్సిడీ గొర్రెల పేరిట రూ.8 కోట్ల లూటీ... తెలంగాణ‌లో ముగ్గురి అరెస్ట్‌

  • సబ్సిడీలో గొర్రెలు ఇప్పిస్తామంటూ మోసం
  • నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి జిల్లాలలో వ‌సూళ్లు
  • స‌జ్జ శ్రీనివాస‌రావు, ల‌క్ష్మీ, కొల్లి అర‌వింద్‌ల అరెస్ట్‌
three people arrested who decieve wuth Subsidy Sheep Distribution Scheme

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ గొర్రెల పంపిణీ ప‌థ‌కాన్ని ఆస‌రా చేసుకుని ఓ ముఠా జ‌నానికి భారీ కుచ్చుటోపీ పెట్టింది. ప్ర‌భుత్వ గొర్రెల పంపిణీ ప‌థ‌కం కింద గొర్రెలు కొనుగోలు చేసిన వారికి ప్ర‌భుత్వం నుంచి సబ్సిడీ ల‌భిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ప్రారంభించిన ఈ ప‌థ‌కానికి బాగానే ఆద‌ర‌ణ ల‌భించింది. అదే స‌మ‌యంలో ఈ ప‌థ‌కం ఆధారంగా జ‌నాన్ని భారీ ఎత్తున మోసం చేసిన ఘ‌ట‌న‌లు కూడా న‌మోద‌య్యాయి. 

ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో భాగంగా శుక్ర‌వారం ఓ భారీ మోసం వెలుగు చూసింది. ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప‌థ‌కం కింద సబ్సిడీకే గొర్రెల‌ను ఇప్పిస్తామంటూ స‌జ్జ శ్రీనివాస‌రావు, ల‌క్ష్మీ, కొల్లి అర‌వింద్‌లు జ‌నం నుంచి ఏకంగా రూ.8 కోట్లు వ‌సూలు చేశారు. రాష్ట్రంలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో వీరు మోసానికి పాల్ప‌డ్డారు. వీరి మోసంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వీరు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More Telugu News