Akash Puri: బాలకృష్ణ చేతుల మీదుగా ఆకాష్ పూరీ ‘చోర్ బజార్’ సినిమా ట్రైలర్ విడుదల

Balakrishna launches Akash Puri film Chore Bazar trailer
  • ఆకాశ్ పూరీ, గెహన సిప్పీ జంటగా 'చోర్ బజార్'
  • సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందన్న బాలయ్య
  • 'పైసా వసూల్' సినిమా నుంచి పూరీ జగన్నాథ్ కుటుంబంతో అనుబంధం ఏర్పడిందని వ్యాఖ్య
ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ తాజా చిత్రం 'చోర్ బజార్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఆకాశ్ సరసన గెహన సిప్పీ నటిస్తోంది. 'జార్జ్ రెడ్డి', 'దళం' చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో వుండి కూడా ట్రైలర్ ను విడుదల చేసినందుకు బాలయ్యకు చిత్ర బృందం థ్యాంక్స్ తెలియజేశారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, 'చోర్ బజార్' ట్రైలర్ చాలా బాగుందని, టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉందని కితాబునిచ్చారు. పూరి జగన్నాథ్ కుటుంబంతో 'పైసా వసూల్' సినిమా నుంచి తనకు మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఈ సినిమాతో ఆకాశ్ పూరీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

మన తెలుగు వారికి సినిమా కూడా నిత్యావసరమే అని బాలకృష్ణ అన్నారు. కరోనా సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గినప్పటికీ... ఆ తర్వాత మళ్లీ మన సినిమాలు మంచి వసూళ్లను సాధిస్తున్నాయని చెప్పారు. భిన్నంగా, కొత్తగా ఉన్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని అన్నారు. ఈ సినిమా కూడా ఆ తరహా చిత్రమే అవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

మరోవైపు, 'చోర్ బజార్' ట్రైలర్ లో హీరో బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ తో ఆకాష్ పూరీ మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నాడు. 'ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికీ ఒక దూల ఉంటుంది. నాకు చేతి దూల. 20 నిమిషాల్లో 30 టైర్స్ విప్పేస్తా. నా దిల్ కా దఢకన్ కోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి' అంటూ ఆకాష్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రేమకథకు డైమండ్ మిస్సింగ్ ఎలిమెంట్ పెట్టడం ద్వారా కంప్లీట్ కమర్షియాలిటీ తీసుకొచ్చారు దర్శకుడు జీవన్ రెడ్డి. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.
Akash Puri
Chore Bazar
Balakrishna
Tollywood
Trailer

More Telugu News