Vishnu Vardhan Reddy: ఏపీలో అధికార పక్షానికి చట్టం చుట్టమయిందా?: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy demands for Seediri Appalaraju arrest
  • సోము వీర్రాజుపై అక్రమ కేసులు పెట్టారన్న విష్ణువర్ధన్ 
  • గతంలో పోలీసులపై సీదిరి అప్పలరాజు దాడి చేశారని ఆరోపణ 
  • ఆయనపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదన్న విష్ణువర్ధన్ 

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వీర్రాజు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, ఆయన వాహనాన్ని రోడ్డుపైనే అడ్డుకున్నారని చెప్పారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆయనపై కేసు పెట్టారని చెప్పారు. 

మరోవైపు గతంలో విశాఖ శారదాపీఠం వద్ద సీఎం జగన్ సమక్షంలోనే పోలీసులపై మంత్రి సీదిరి అప్పలరాజు దాడికి పాల్పడ్డారని... దీనికి సంబంధించి అన్ని ఛానళ్లలో కథనాలు వచ్చాయని, అయినా ఇప్పటి వరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు. ఏపీలో అధికార పక్షానికి చట్టం చుట్టమయిందా? అని ప్రశ్నించారు. అప్పలరాజుపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News