తిరుపతిలో మూడ్రోజుల పాటు పర్యటించనున్న సీజేఐ ఎన్వీ రమణ

  • నేడు ఢిల్లీ నుంచి చెన్నై రాక
  • రోడ్డుమార్గంలో తిరుపతి చేరుకోనున్న సీజేఐ
  • రేపు తిరుపతిలో స్పెషల్ కోర్టుల ప్రారంభం
  • శుక్రవారం హైదరాబాద్ కు పయనం
CJI NV Ramana comes to Tirupati

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుపతి వస్తున్నారు. ఆయన తిరుపతిలో మూడ్రోజుల పాటు పర్యటించనున్నారు. నేడు ఢిల్లీ నుంచి చెన్నై రానున్న సీజేఐ ఎన్వీ రమణ అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాత్రి 8 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఆయన తిరుపతిలోనే బస చేస్తారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల విచారణ కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు స్పెషల్ కోర్టులను రేపు (గురువారం) ఉదయం ప్రారంభిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు పయనమవుతారు.

More Telugu News