భారత్ కు గిన్నిస్ రికార్డు.. ఏకధాటిగా పొడవైన రోడ్డు నిర్మాణం.. ఇవిగో ఫొటోలు
- మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా మధ్య హైవే నిర్మాణం
- జూన్ 3 నుంచి 7 దాకా ఏకధాటిగా 75 కిలోమీటర్లు రోడ్డేసిన వైనం
- ఇంజనీర్లు, కార్మికులను అభినందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇంతటి గొప్ప పనిలో రేయింబవళ్లు భాగమైన ఇంజనీర్లు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. వారి దృఢసంకల్పం, చెమటధారతోనే నవ భారత నిర్మాణం సాధ్యమవుతోందని చెప్పారు. ఈ గొప్ప పనికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు.