Andhra Pradesh: ఏపీ టెన్త్ విద్యార్థుల్లో చాలామంది సోషల్‌లో ఫెయిల్.. కారణం అదేనా?

Maximum students in AP failed in Social Subject
  • సోషల్ పరీక్షలో బిట్ పేపర్‌ను 30 నుంచి 12 మార్కులకు తగ్గించిన ప్రభుత్వం
  • సోషల్ తర్వాత మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్
  • హిందీలోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి టెన్త్ ఉత్తీర్ణత శాతం విపరీతంగా తగ్గడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పదో తరగతిలో ఫెయిల్  అయిన విద్యార్థుల్లో ఎక్కువమంది సోషల్ సబ్జెక్టులోనే తప్పడం గమనార్హం. హిందీ, ఇంగ్లిష్ వంటి కఠిన సబ్జెక్టుల్లోనూ పాస్ అయిన విద్యార్థులు.. సోషల్‌లో తప్పడానికి కారణం బిట్ పేపర్‌ను కుదించడమేనని చెబుతున్నారు.

గతంలో బిట్ పేపర్ 30 మార్కులకు ఉండగా, ఈసారి దానిని 12 మార్కులకు తగ్గించారు. కాబట్టే మార్కులు తగ్గి ఫెయిల్ అయ్యారని అంటున్నారు. సోషల్ తర్వాత ఎక్కువమంది ఫెయిలైన సబ్జెక్టుల్లో మ్యాథ్స్, సైన్స్ కూడా వున్నాయి. లాంగ్వేజెస్‌లో మాత్రం అత్యధికమంది విద్యార్థులు పాసయ్యారు. ఇక, ఇంగ్లిష్ సబ్జెక్టులో పాసైన వారిలో ఎక్కువమంది ప్రైవేటు స్కూళ్లకు చెందినవారు ఉండడం గమనార్హం. హిందీ పరీక్షలో 20 మార్కులకే పాస్ కాబట్టి ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత శాతం బాగానే ఉంది.
Andhra Pradesh
Tenth Exams
Social Exam
Hindi

More Telugu News