Nayanthara: నా ప్రేయసి నయనతారను పెళ్లి చేసుకోబోతున్నా: అధికారికంగా ప్రకటించిన విఘ్నేశ్ శివన్

Vignesh Sivan makes afficial announcement about his marriage with Nayanthara
  • జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నామన్న విఘ్నేశ్ 
  • ఇరు కుటుంబాలు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరవుతున్నారని వెల్లడి 
  • జూన్ 11న అందరినీ ప్రత్యేక్తంగా కలుస్తామని చెప్పిన విఘ్నేశ్ 

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి బంధంతో ఒకటవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ప్రేమలోకంలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, పెళ్లిపై వీరిద్దరూ అఫీషియల్ గా ఎక్కడా మాట్లాడని సంగతి తెలిసిందే. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి, వీరు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. 

మరోవైపు తాజాగా తమ వివాహంపై విఘ్నేశ్ శివన్ అధికారికంగా స్పందించాడు. తన ప్రేయసి నయనతాను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. జూన్ 9న మహాబలిపురంలో తమ పెళ్లి జరగబోతోందని తెలిపాడు. తమ వివాహానికి ఇరువురి కుటుంబాలు, సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారని చెప్పాడు. తొలుత తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. అయితే ప్రయాణ పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చనిపించడంతో వివాహ వేదికను మహాబలిపురానికి మార్చామని తెలిపాడు. 

జూన్ 9న పెళ్లి జరుగుతుందని... పెళ్లి ఫొటోలను మధ్యాహ్నానికల్లా సోషల్ మీడియాలో షేర్ చేస్తామని విఘ్నశ్ తెలిపాడు. జూన్ 11న ఇద్దరం అందరినీ ప్రత్యేకంగా కలుస్తామని చెప్పాడు. తమపై అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నాడు. 

  • Loading...

More Telugu News