పొత్తుల కోసం ఆరాటపడుతున్న పవన్ ను ప్రజలు మళ్లీ ఓడిస్తారు: మంత్రి రోజా

06-06-2022 Mon 18:47 | Andhra
  • 2019లో ప‌వ‌న్‌ను రెండు చోట్ల ఓడించారన్న రోజా 
  • 2024లోనూ అదే రిపీట్ అవుతుందని కామెంట్ 
  • చంద్ర‌బాబుది రెండు క‌ళ్ల సిద్ధాంతమని ఎద్దేవా 
  • బ‌ద్వేలుకు మించిన మెజారిటీ ఆత్మ‌కూరులో వ‌స్తుంద‌న్న రోజా
ap minister rk roja comments on chandrababu and pawan kalyan
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మంత్రి ఆర్కే రోజా మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసమేన‌ని ఆమె ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నిక‌ల్లో పవన్‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు రెండు చోట్ల ఓడించారని ఆమె ఎద్దేవా చేశారు. 2024 ఎన్నిక‌ల్లో అదే రిపీట్‌ అవుతుందని ఆమె జోస్యం చెప్పారు. 

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడును టార్గెట్ చేసిన రోజా... చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆమె వ్యాఖ్యానించారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైసీపీకి వస్తుందని ఆమె తెలిపారు. బద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.