ఇందుకు కదూ నిన్ను చిల్లర రాంబాబు అనేది!: అయ్యన్న

06-06-2022 Mon 18:11 | Andhra
  • ఉమ చేసిన ట్వీట్ ఇదేనంటూ అంబటి వ్యాఖ్యలు
  • అది ఫేక్ ట్వీట్ అంటూ టీడీపీ నేతల ఖండన
  • పేటీఎం చిల్లర వెధవలు తయారుచేసిన పోస్టు అన్న అయ్యన్న
Ayyanna counter tweet to rambabu
దేవినేని ఉమకు సంబంధించి ఓ ట్వీట్ ను మంత్రి అంబటి రాంబాబు పంచుకోవడం తెలిసిందే. అది ఫేక్ ట్వీట్ అంటూ టీడీపీ నేతలు ముక్తకంఠంతో అంబటి రాంబాబు విమర్శలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. 

ఇందుకు కదూ నిన్ను చిల్లర రాంబాబు అనేది అంటూ విమర్శించారు. "పేటీఎం చిల్లర వెధవలు తయారుచేసిన ఫేక్ పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలనుకునే నీలాంటి గొట్టంగాడికి మంత్రి పదవిని ఇచ్చిన వాడిని అనాలి" అంటూ అయ్యన్న మండిపడ్డారు.