బెంజ్ కార్లలో లోపం... లక్షలాది కార్లు రీకాల్

  • తుప్పు పడుతున్న బ్రేకింగ్ బూస్టర్
  • బ్రేక్ ఫెయిలయ్యే అవకాశం
  • 10 లక్షల కార్లు వెనక్కి!
  • ఒక్క జర్మనీలోనే 70 వేల కార్ల రీకాల్
Mercedes Benz recalls cars world wide

మెర్సిడెస్ బెంజ్ కారు... హోదాకు, దర్పానికి చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే సంపన్నులు, సెలబ్రిటీలు బెంజ్ కారును కలిగి ఉండడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. భారత్ లోనూ బెంజ్ కారు అభిమానులు చాలామందే ఉన్నారు. 

ఇక అసలు విషయానికొస్తే... బెంజ్ కార్లలో ఇటీవల లోపాన్ని గుర్తించారు. కారు బ్రేకింగ్ బూస్టర్ తుప్పు పడుతున్నట్టు నిర్ధారణ అయింది. ఈ కారణంగా ఒక్కోసారి బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. దాంతో, ఈ జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ప్రపంచ్యాప్తంగా లక్షలాది కార్లను వెనక్కి పిలిపిస్తోంది. ఆర్ క్లాస్ మినీ వ్యాన్, ఎస్ యూవీ ఎంఎల్, జీఎల్ మోడళ్లలో ఈ లోపం ఉన్నట్టు వెల్లడైంది. దాదాపు 10 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్టు మెర్సిడెస్ బెంజ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ 2004 నుంచి 2015 మధ్య తయారైనవి. 

ఒకవేళ అవసరమైతే తుప్పుపట్టిన భాగాన్ని తొలగించి, ఆ పార్టులను రీప్లేస్ చేస్తామని మెర్సిడెస్ వెల్లడించింది. తనిఖీ పూర్తయ్యేంతవరకు తాము పేర్కొన్న మోడల్ కార్లను నడపరాదని యజమానులకు బెంజ్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా, రీకాల్ చేస్తున్న కార్లలో ఒక్క జర్మనీలోనే 70 వేల వరకు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News