తమిళనాడులో విషాదం... నదిలో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిల మృతి

  • కడలూరు వద్ద నదిలో స్నానానికి దిగిన అమ్మాయిలు
  • నదిలో పెరిగిన నీటి ప్రవాహం
  • బయటికి రాలేకపోయిన అమ్మాయిలు
Seven girls drowned to death in Tamilnadu

తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి కెడిలం నదిలో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిలు దుర్మరణం పాలయ్యారు. పరిసర గ్రామాలకు చెందిన అమ్మాయిలు ఈ మధ్యాహ్నం నదిలో స్నానానికి వచ్చారు. వారు నీటిలో దిగిన కొంతసేపటికి నీటి ప్రవాహం పెరిగింది. దాంతో ఆ అమ్మాయిల్లో కొందరు మునిగిపోయారు. 

అక్కడున్నవారు ఇది గమనించి నదిలో దిగి వారిని బయటికి తీశారు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ అమ్మాయిలు మృతి చెందారు. కాగా, మరణించిన అమ్మాయిలు సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోనిష (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)గా గుర్తించారు. వీరంతా కుచ్చిపాలయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారు. వారిలో ప్రియదర్శిని, దివ్యదర్శిని అక్కాచెల్లెళ్లు.

More Telugu News