golden rules: ఆర్థిక ఆనందానికి అనుసరించాల్సిన మార్గాలివే..

  • తగిన ప్రణాళికలు ప్రతి ఒక్కరికీ ఉండాలి
  • లైఫ్, హల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి
  • ఖర్చులు తగ్గించుకోవాలి
  • కాల నిర్వహణ కూడా ముఖ్యమే
5 golden rules for making your financial life happier

గడిచిన రెండేళ్ల కాలంలో ఎంతో మంది గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరోనా విదిల్చిన విషాదం నుంచి ఇంకా చాలా మంది కోలుకోలేదు. ముఖ్యంగా చికిత్సల కోసం చేసిన ఖర్చుతో, ఉపాధి కోల్పోయిన కారణంగా ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. నిజానికి ఆర్థిక అంశాల నిర్వహణ అంత ఆషామాషీయే కాదు. తగిన ప్రణాళికే ఈ పరిస్థితుల్లో నింపాదిగా ఉంచుతుంది. ఈ దృష్ట్యా ఆర్థికంగా ఆరోగ్యకరమైన రీతిలో ఉండేందుకు నిపుణులు చేస్తున్న సూచనలు ఇవే..


భవిష్యత్తు ప్రణాళిక
ఆర్థిక పరిస్థితి ఏంటన్నది ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ఆదాయం, అందులో పొదుపు, ఈఎంఐలు, వ్యయాలు, భవిష్యత్తు లక్ష్యాలు ఇలా అన్నింటికీ చోటు కల్పించాలి. అన్ని రకాల వ్యయాలు, అన్ని రకాల ఆదాయం మధ్య బ్యాలన్స్ చేయాలి. పెద్దగా మిగలడం లేదంటే అదనపు ఆదాయం కోసం శ్రమించడం లేదంటే ఖర్చుల్లోంచి తగ్గించుకుని పెట్టుబడుల కోసం మిగుల్చుకోవడం ఒకటి. ఈ అంశాలతో ఒక ప్రణాళిక రూపొదించుకోవాలి.

లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్
ఈ రెండు బీమా రక్షణలు ప్రతి వ్యక్తికి అవసరమే. హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగాలు చేయని వారికి కూడా లభిస్తుంది. అదే టర్మ్ ప్లాన్ ఆదాయం ఉన్న వారికే బీమా సంస్థలు ఇస్తుంటాయి. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి జరగరానిది జరిగితే పరిహారంతో బీమా సంస్థ అప్పుడు ఆదుకుంటుంది. దాన్ని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కు ఆదాయంతో పనిలేదు. కుటుంబంలో చిన్న పిల్లల దగ్గర్నుంచి, వృద్ధుల వరకు అందరికీ కవరేజీ ఇచ్చే హెల్త్ ప్లాన్ లు బోలెడు ఉన్నాయి. ఆకస్మికంగా ఎదురయ్యే అనారోగ్యాలు, కరోనా వంటి వైరస్ మప్పుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అండగా ఉంటుంది.

వ్యయాలు
అధికంగా చేసే ఖర్చులను వెంటనే నియంత్రించుకోవాలి. అది ఏ అవసరం కోసం ఖర్చు చేసినా బ్యాలన్స్ తప్పితే ఇబ్బందుల్లో పడిపోతాం. కనుక వ్యయాల విషయంలో కచ్చితంగా నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. 

కాల నిర్వహణ
డబ్బులు సంపాదించుకోగలం. కానీ కాలాన్ని కాదు. ఆర్థిక స్థిరత్వం, సంతోషం కోసం కాలాన్ని చక్కగా వినియోగించుకోవడం అవసరం. కనుక విలువను పెంచని వాటి కోసం కాలాన్ని వృధా చేసుకోవద్దు.

సంతోషం
ఇంకా బాగా సంపాదించాలన్న కాంక్ష ఎప్పటికీ పోదు. ఉన్నదాంతో సంతృప్తి చెందడం కూడా ఎంతో అవసరం.

More Telugu News