Hyderabad: జూబ్లీహిల్స్ లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే.. హైదరాబాద్ లో మరో దారుణం

Another Incident of Minor Kidnap In Hyderabad
  • 4 రోజుల క్రితం 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్
  • నిన్న సుల్తాన్ షాహీ ప్రాంతంలో విడిచి వెళ్లిన వైనం
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముగ్గురి అరెస్ట్
  • అత్యాచార కోణంలో దర్యాప్తు
జూబ్లీహిల్స్ లో బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచార ఘటనపై విచారణ జరుగుతుండగానే.. హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. నాలుగు రోజుల క్రితం మొఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సుల్తాన్ షాహీ ప్రాంతానికి చెందిన బాలిక షాహీన్ నగర్ లోని బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్.. ఇంటి వద్ద విడిచిపెడతానంటూ నమ్మించి కారు ఎక్కించుకున్నాడు. 

ఆమెను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ కు తీసుకెళ్లాడు. నిన్న ఉదయం బాలికను మళ్లీ సుల్తాన్ షాహీ ప్రాంతంలో వదిలి వెళ్లాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన బయటకు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు లుక్మాన్ తో పాటు అతడికి సహకరించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అత్యాచారం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొందుర్గ్ లో లుక్మాన్ కు ఎవరు ఆశ్రయమిచ్చారన్న దానిపైనా విచారణ చేస్తున్నారు.
Hyderabad
Kidnap
Crime News
Telangana

More Telugu News