యోగి డైనమిక్ సీఎం అంటూ మెచ్చుకున్న: ప్రధాని మోదీ

  • నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న యోగి
  • సీఎం నాయకత్వంలో కొత్త శిఖరాలకు యూపీ
  • దీర్ఘకాలం పాటు ఆరోగ్యంతో ప్రజాసేవకు అంకితం కావాలని ట్వీట్
  • కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీఎస్పీ మాయావతి సైతం శుభాకాంక్షలు
A dynamic CM PM Modi wishes UP CM Yogi Adityanath on 50th birthday

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. యోగి నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ ను ‘డైనమిక్ సీఎం’అని ప్రధాని కీర్తించారు. యోగి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో నూతన శిఖరాలను చేరుకున్నట్టు ప్రకటించారు. ‘‘రాష్ట్ర ప్రజలకు ప్రజా అనుకూల పాలనకు భరోసా ఇచ్చారు. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించి ప్రజల కోసం సేవ చేయాలి’’అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. 


బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’అని మాయావతి ప్రకటించారు. 

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. ‘‘ఉత్తరప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి పూర్తి అధికారం, వ్యూహంతో పనిచేస్తున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమం కోసం విరామం లేకుండా అంకితభావంతో పనిచేస్తున్నారు’’అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. 1972 జూన్ 5న ఆదిత్యనాథ్ జన్మించారు.

శనివారం సాయంత్రం వారణాసిలో ప్రత్యేక గంగా హారతి ఇచ్చారు. ఇందులో బుల్డోజర్లు కూడా పాల్గొనడం విశేషం. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో నేలమట్టం చేసే విధానాన్ని సీఎం యోగి దీర్ఘకాలంగా అనుసరిస్తుండడంతో ఆయనకు బుల్డోజర్ బాబా అన్న పేరు కూడా పడింది.

More Telugu News