కాకినాడలో దారుణం: కరోనా మాత్రలని చెప్పి మత్తుమందు ఇచ్చి.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వసతిగృహ కరస్పాండెంట్
- వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న బాలిక
- మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసిన కరస్పాండెంట్
- మూడు రోజులుగా రక్తస్రావం కావడంతో ఆరా తీసిన తల్లి
- నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
ఈ క్రమంలో ఈ ఏప్రిల్‌లో బాలికకు మాయమాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లిన నిందితుడు విజయకుమార్ కరోనా మాత్రలంటూ బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక బాలిక మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్న బాలిక మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధిత బాలిక కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమెకు గర్భస్రావం అయినట్టు వైద్యులు తెలిపారు. విజయకుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.