JIO: రూ.151 ప్లాన్ తో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో

JIO announces Disney plus hotstar subscription with Rs 151 plan
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితం
  • మూడ్నెల్ల పాటు లభ్యం
  • రూ.151 పూర్తిగా డేటా ప్లాన్
  • 90 రోజుల కాలపరిమితితో 8 జీబీ డేటా
భారత టెలికాం రంగంలో విప్లవం అనదగ్గ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. రూ.151 విలువతో ఓ డేటా ప్లాన్ ను ప్రకటించింది. ఈ డేటా ప్లాన్ తీసుకుంటే 8 జీబీ డేటా లభిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. జియో తన కొత్త ప్లాన్ తో ఓ బంపర్ ఆఫర్ కూడా అందిస్తోంది. 

ఇక ఈ రూ.151 ప్లాన్ ను కొనుగోలు చేసిన వారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఏదైనా సాధారణ ప్లాన్ పై కొనసాగుతున్నప్పుడు మాత్రమే ఈ డేటా ప్లాన్ ను కొనుగోలు చేసే వీలుంటుంది. 

ఇవే కాకుండా రూ.333, రూ.583, రూ.783 ప్లాన్లను కూడా జియో ప్రకటించింది. వీటన్నింటిలోనూ మూడు నెలల కాలపరిమితితో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
JIO
Bumper Offer
Rs.151
Disney+ Hotstar
Data Plan

More Telugu News