YSRCP: ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం: సజ్జల

sajjala inaugurates apngos apartments
  • ఏపీఎన్జీవోస్‌ అపార్టుమెంట్స్‌ను ప్రారంభించిన స‌జ్జ‌ల‌
  • జగన్‌ ఆలోచనలు సాధ్యం కావాలంటే ఉద్యోగుల సహకారం ఉండాలని వ్యాఖ్య 
  • ఉద్యోగుల కలల సాకారం కోసం ప్రభుత్వం ముందుంటుందని హామీ ‌

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వైసీపీ ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి అన్నారు. శ‌నివారం ఏపీఎన్జీవోస్‌ అపార్టుమెంట్స్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న ఉద్యోగుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఏపీఎన్జీవో అపార్టుమెంట్స్‌ నిర్మించుకోవడం సంతోషకరమని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని స‌జ్జ‌ల పేర్కొన్నారు. కోవిడ్‌ సమయంలోనూ ఉద్యోగులు సేవలు అందించారని ఆయ‌న కొనియాడారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనలు సాధ్యం కావాలంటే ఉద్యోగుల సహకారం ఉండాలని ఆయ‌న అన్నారు. ఉద్యోగుల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయ‌న ఉద్యోగుల‌కు భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News