Hyderabad: పోలీసుల అదుపులో గ్యాంగ్ రేప్ నిందితులు.. ఇన్నోవా కారు ఆచూకీ ల‌భ్యం

police arrests hanh rape accused and finds missing innova car
  • గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డ ఐదుగురు నిందితులు
  • నిందితుల్లో ఇద్ద‌రు మేజ‌ర్లు, ముగ్గురు మైన‌ర్లు
  • అంద‌రినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మ‌రికాసేప‌ట్లోనే కోర్టులో హాజ‌రుప‌రిచే అవ‌కాశం
  • కారులో ఆధారాల సేక‌ర‌ణ‌లో క్లూస్ టీంలు
హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్ స‌మీపంలో బాలిక‌ను అప‌హ‌రించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్ద‌రు మేజ‌ర్లు కాగా... ముగ్గురు మైన‌ర్లు. మ‌రికాసేప‌ట్లోనే నిందితుల‌ను కోర్టులో హాజ‌రుప‌రిచేందుకు పోలీసులు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...బాలిక‌పై అత్యాచారం చేసేందుకు నిందితులు వినియోగించిన ఇన్నోవాను పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌న త‌ర్వాత వేర్వేరు దారుల మీదుగా క‌ర్ణాట‌క పారిపోయిన నిందితులు ఇన్నోవాను మాత్రం పోలీసుల‌కు చిక్క‌కుండా దాచేశారు. ఈ విష‌యాన్ని గుర్తించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో ఇన్నోవా ఆచూకీని క‌నుగొన్నారు. కారులో క్లూస్ టీంతో ఆధారాలు సేక‌రించే ప‌నిని పోలీసులు చేపట్టారు.
Hyderabad
Gang Rape
Hyderabad Police

More Telugu News