హైదరాబాద్ గ్యాంగ్ రేప్.. ఎమ్మెల్యే కొడుకు ఫొటోలను విడుదల చేసిన రఘునందన్ రావు!
- తెలంగాణలో కలకలం రేపుతున్న హైదరాబాద్ గ్యాంగ్ రేప్
- పోలీసుల బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరన్న రఘునందన్
- అందుకే ఆధారాలు చూపిస్తున్నామని వెల్లడి
- నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారని నిలదీత
ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని అన్నారు. మమ్మల్ని భయపెట్టడం మానేసి, తప్పులు చేసిన వారిని భయపెట్టండని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామని పోలీసులు అన్నారని... అందుకు ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నానని చెప్పారు.
అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని ప్రశ్నించారు. నిందితులను ఇప్పటికే దేశం దాటించారని చెప్పారు. నిందితులు మేజరా? లేక మైనరా? అనే విషయం అనవసరమని చెప్పారు. నిర్భయ కేసులో కూడా మైనర్ల పేర్లు బయటకు వచ్చాయని... ఇక్కడ మన పోలీసులు నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.