Chandrababu: గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం ఒక స్వర్ణయుగం: చంద్రబాబు

Chandrababu pays tributes on SP Balasubrahmanyam birth anniversary
  • నేడు ఎస్పీ బాలు జయంతి
  • గతేడాది కరోనా ప్రభావంతో మరణించిన బాలు
  • ఇప్పటికీ అభిమానులను వీడని విషాదం
  • సోషల్ మీడియాలో స్పందించిన చంద్రబాబు
నేడు (జూన్ 4) గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి. గతేడాది ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనా అనంతర సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ సినీ పరిశ్రమ, ఆయనతో అనుబంధం ఉన్నవారు, అభిమానులు జయంతి సందర్భంగా ఆ మహోన్నత కళాకారుడ్ని స్మరించుకుంటున్నారు. 

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. సినీ సంగీత చరిత్రలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రస్థానం ఒక స్వర్ణయుగం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో అజరామరమైన పాటలను ఆలపించి ఆబాల గోపాలాన్ని మంత్రముగ్ధులను చేశారని కీర్తించారు. ఆ మధుర గాయకుని జయంతి సందర్భంగా ఆయన కళారంగ సేవలను స్మరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
Chandrababu
SP Balasubrahmanyam
Birth Anniversary
Tributes
Legend

More Telugu News