Kshama Bindu: ఆలయంలో ఇలాంటి పెళ్లా?... తనను తాను పెళ్లాడాలనుకున్న అమ్మాయికి నో చెప్పిన గోత్రి ఆలయ వర్గాలు

Gotri temple trust said no for Kshama Bindu
  • భారత్ లో మొట్టమొదటి సోలోగమీ!
  • తనను తాను పెళ్లాడాలని నిర్ణయించుకున్న క్షమాబిందు
  • ఈ నెల 11న గోత్రి ఆలయంలో పెళ్లి అని వెల్లడి
  • తాము అంగీకరించబోమన్న గోత్రి ఆలయ పాలకమండలి

తనను తానే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన గుజరాత్ అమ్మాయి క్షమాబిందు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత్ లో ఇలాంటి ధోరణులు కొత్త కావడంతో క్షమాబిందు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే, జూన్ 11న వడోదర గోత్రి ఆలయంలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు క్షమాబిందు ఇప్పటికే పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించింది. 

అయితే, గోత్రి ఆలయ వర్గాలు ఈ పెళ్లికి నో చెప్పాయి. తమ ఆలయంలో ఇలాంటి పెళ్లికి అంగీకరించబోమని స్పష్టం చేశాయి. ఈ తరహా వివాహాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తాయని గోత్రి ఆలయ పాలకమండలి అభిప్రాయపడింది. ఆలయ పాలకమండలి నిర్ణయంపై క్షమాబిందు స్పందించింది. ఆ గుడిలో తాను పెళ్లి చేసుకోబోవడంలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, క్షమాబిందు ఎక్కడ పెళ్లి చేసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

కాగా, పెళ్లి తర్వాత ఈ అమ్మాయి హనీమూన్ కు కూడా ప్లాన్ చేసుకుంది. పెళ్లవగానే గోవా వెళతానని గత ప్రకటనలో వెల్లడించింది.

  • Loading...

More Telugu News