Amaravati: నేటితో అమరావతి రాజధాని ఉద్యమానికి 900 రోజులు

  • ఏపీ రాజధాని అమరావతి అని పేర్కొన్న గత ప్రభుత్వం
  • వైసీపీ వచ్చాక మూడు రాజధానుల నిర్ణయం
  • ఉద్యమం ప్రారంభించిన అమరావతి రైతులు
  • 2019 డిసెంబరు 17న ఉద్యమం మొదలు
  • వివిధ రూపాల్లో కొనసాగిన ఉద్యమం
Amaravati movement completes 900 days

వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు హతాశులయ్యారు. అయితే, రాజధాని కోసం వారు వీరు అన్న తేడా లేకుండా, రైతులు, మహిళలు, పిన్నలు, పెద్దలు దీక్ష ప్రారంభించారు. 2019 డిసెంబరు 17న మొదలైన ఆ దీక్ష నేటితో 900 రోజులకు చేరింది. ఈ రాజధాని ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా, కోర్టు తీర్పులు వారికి ఎనలేని ఊరటనిచ్చాయి. 

ఈ నేపథ్యంలో, ఉద్యమం 900 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి రైతులు న్యాయదేవతకు పాలాభిషేకం చేయనున్నారు. రాజధాని ఉద్యమ వీరులకు నివాళులు అర్పించనున్నారు. నేడు విజయవాడలో 'హైకోర్టు తీర్పు-సర్కారు తీరు' పేరిట సదస్సు నిర్వహించనున్నారు. అమరావతిని రాజధానిగా సాధించేంతవరకు పోరాటం ఆపబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News