BJP: యూపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన తెలంగాణ నేత కె.ల‌క్ష్మ‌ణ్‌

  • యూపీ కోటా నుంచి రాజ్య‌స‌భ బ‌రిలోకి ల‌క్ష్మ‌ణ్‌
  • నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ముగిసిన గ‌డువు
  • ల‌క్ష్మ‌ణ్ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించిన ఈసీ
  • రిట‌ర్నింగ్ అధికారి నుంచి డిక్ల‌రేష‌న్ అందుకున్న లక్ష్మ‌ణ్‌
k laxman elected to rajyasabha from uttar pradesh

తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ తెలంగాణ శాఖ మాజీ అధ్య‌క్షుడు కె.ల‌క్ష్మ‌ణ్ రాజ్య‌స‌భ‌కు ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ముగియ‌గానే... కె.ల‌క్ష్మ‌ణ్ రాజ్య‌స‌భ‌కు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు కేంద్ర ఎన్నిక సంఘం ప్ర‌క‌టించింది. రిట‌ర్నింగ్ అధికారి నుంచి ల‌క్ష్మ‌ణ్ డిక్ల‌రేష‌న్ అందుకున్నారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా కె.ల‌క్ష్మ‌ణ్ వెల్ల‌డించారు. నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంటు సభ్యునిగా రాజ్యసభకు ఎన్నికయ్యాను అంటూ ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. యూపీ కోటా నుంచి బీజేపీ ఆయ‌న‌ను రాజ్య‌స‌భ బ‌రిలో నిలిపిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ల‌కు ల‌క్ష్మ‌ణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

More Telugu News