హైదరాబాదులో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన బండి సంజయ్
- జూబ్లీహిల్స్ లో దారుణం
- కారులో బాలికపై అత్యాచారం
- మహిళలకు భద్రత లేదని బండి సంజయ్ ఆవేదన
- నిందితుల వివరాలు వెల్లడించాలని డిమాండ్
జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనూ మహిళలకు భద్రత లేదన్న విషయం తాజా ఘటనతో వెల్లడైందని తెలిపారు. చెప్పుకుంటే ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిందితులను సరిగా గుర్తించలేని విధంగా ఉన్న సీసీ కెమెరాల వల్ల ఉపయోగం ఏంటి? అని నిలదీశారు.
"ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? జాప్యానికి కారణం ఏంటి? వారు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు? పోలీసులు దాగుడుమూతలు ఆడడం మానేసి ఇకనైనా నిందితుల వివరాలను బహిర్గతం చేయాలి. వాళ్లు నిజంగానే మైనర్లా లేక ఈ వ్యవహారంలో వారి వివరాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందా? అనేది ప్రజలకు తెలియాలి" అంటూ బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.