Andhra Pradesh: మీరు, మీ పార్టీ నేతలు, పోలీసులు, వలంటీర్ల నుంచి రక్షించే ‘యాప్’ను రూపొందించండి సారూ!: నారా లోకేశ్

  • మహిళలను పోలీసులు చున్నీతో బంధించడంపై లోకేశ్ స్పందన
  • సభ్య సమాజం తలదించుకుందంటూ వ్యాఖ్య  
  • ఇంకెన్నాళ్లీ దౌర్జన్య పాలన? అంటూ మండిపాటు
Nara Lokesh Fires On AP govt

సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో ఇద్దరు యువతులను మహిళా పోలీసులు చున్నీలతో బంధించడంపై ఆయన స్పందించారు. ‘‘మీరు, మీ పార్టీ నేతలు, పోలీసులు, వలంటీర్లు చేస్తున్న అరాచకాల నుంచి రక్షించే ఏదైనా యాప్ ను రూపొందించండి సారూ’’ అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. 

రెవెన్యూ సిబ్బంది పోలీసులతో వచ్చి తన ఇంటి ముందున్న స్థలాన్ని స్వాధీనం చేసుకుంటుంటే మీనాక్ష్మమ్మ, ఆమె కూతురు అడ్డుకున్నారని, సాటి మహిళలని కూడా చూడకుండా మహిళా పోలీసులు వారిని తమ చున్నీలతో బంధించడం అరాచకపాలనలో మరో అమానవీయ ఘటన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసుల ఈ అమానవీయ ప్రవర్తనతో సభ్య సమాజం తలదించుకుందన్నారు. ఇంకెన్నాళ్లీ దౌర్జన్య పాలన అని, దుర్మార్గమైన ప్రభుత్వ తీరును ప్రజలంతా ఒక్కటై నిలదీయాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News