Rakul Preet Singh: రకుల్ తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన మంచు లక్ష్మి.. వీడియో ఇదిగో!

Rakul Preet Singh and Lakshmi Manchu trending with this dance video
  • బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్
  • 'లేచింది మహిళా లోకం' చిత్రంలో నటిస్తున్న మంచు లక్ష్మి
  • వీరిద్దరూ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటూ బిజీగా ఉంటోంది. మంచు లక్ష్మితో రకుల్ కు మంచి స్నేహం ఉంది. తాజాగా మంచు లక్ష్మితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఒక పాప్యులర్ పంజాబీ సాంగ్ కు వీరిద్దరూ డ్యాన్స్ ఇరగదీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ 'డాక్టర్ జీ', 'థ్యాంక్ గాడ్', 'అయలాన్', 'ఛత్రివాలీ' తదితర సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు, మంచు లక్ష్మి 'లేచింది మహిళా లోకం' సినిమాతో బిజీగా ఉన్నారు. 
Rakul Preet Singh
Manchu Lakshmi
Dance
Tollywood

More Telugu News