ఢిల్లీ చేరిన సీఎం జగన్... సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ
- గన్నవరం నుంచి బయలుదేరిన జగన్
- ఢిల్లీలోని అధికార నివాసంలో స్వల్ప బస
- అనంతరం మోదీతో భేటీ కానున్న జగన్
- రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలపై చర్చ
- అమిత్ షాను కలిసే దిశగా జగన్ యత్నాలు
ఇదిలా ఉంటే... మోదీతో భేటీ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అయితే అమిత్ షాతో జగన్ భేటీకి సంబంధించి ఇప్పటిదాకా స్పష్టత లేదు. మోదీ అపాయింట్ మెంట్ దక్కినా...అమిత్ షా నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదని సమాచారం. అయితే అమిత్ షాతో జగన్ భేటీకి కూడా ప్రభుత్వ వర్గాలు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.