Andhra Pradesh: విస్తరిస్తున్న రుతుపవనాలు.. కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు

Rains forecast today and tomorrow in Coastal Andhra and Rayalaseema
  • ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్న పశ్చిమ గాలులు
  • ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్న వాతావరణశాఖ
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలతోపాటు అరేబియా సముద్రం, ఆగ్నేయ, నైరుతి, ఈశాన్య బంగాళాఖాతం మీదుగా చురుగ్గా ముందుకు కదులుతున్నాయి

దీనికితోడు ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలతోపాటు అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Andhra Pradesh
Rains
Southwest Monsoon
Coastal Andhra
Rayalaseema

More Telugu News