Subhash Chandra: చివరి క్షణంలో మీడియా మొఘల్ సుభాష్ చంద్రను రాజ్యసభ బరిలోకి దింపిన బీజేపీ!

Media baron Subhash Chandra files Rajya Sabha nomination from BJP
  • రాజస్థాన్ నుంచి రాజ్యసభ బరిలో సుభాష్ చంద్ర
  • జీ నెట్ వర్క్, ఎస్సెల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర
  • రాజస్థాన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
ఇండియన్ బిలియనీర్ మీడియా బ్యారన్ సుభాష్ చంద్ర బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి చివరి క్షణంలో రాజ్యసభ బరిలోకి ఆయనను బీజేపీ అధిష్ఠానం దింపింది. రాజస్థాన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. సుభాష్ చంద్ర ప్రముఖ మీడియా సంస్థ జీ నెట్ వర్క్ అధినేత. ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ కూడా. 2016లో హర్యానా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. నామినేషన్ దాఖలు చేసే ముందు ఆయన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి అరుణ్ సింగ్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా తదితరులతో భేటీ అయ్యారు.
Subhash Chandra
Media Barron
ZEE
BJP
Rajya Sabha
Rajasthan

More Telugu News