Merugu Nagarjuna: నక్కా ఆనందబాబు మట్టి, ఇసుకతో దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి మేరుగు నాగార్జున‌

Everybody knows about Nakka Anand Babu life says Merugu Nagarjuna
  • ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసన్న మంత్రి 
  • జగనన్న కాలనీ ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడి 
  • అక్రమ మట్టి తవ్వకాలంటూ ఆనందబాబు హడావుడి చేయడానికి యత్నించారని విమర్శ 
టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై ఏపీ మంత్రి మేరుగు నాగార్జున మండి పడ్డారు. నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మట్టి, ఇసుకతో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 

వేమూరు నియోజకవర్గంలో వైయస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ అనుమతులు, పంచాయతీ తీర్మానాలు ఉన్నాయని తెలిపారు. 

అక్రమ మట్టి తవ్వకాలు అంటూ నక్కా ఆనందబాబు హడావుడి చేయడానికి యత్నించారని.. దీంతో, ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఏ ఊరుకి వెళ్లినా ఆయనకు ఇదే గతి పడుతుందని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Merugu Nagarjuna
YSRCP
Nakka Anand Babu
Telugudesam

More Telugu News