Kurnool: ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం: కర్నూలు మేయర్

Kurnool Mayor BY Ramaiah gives warning to few news papers journalists
  • వైసీపీ బస్సు యాత్రకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికల్లో కథనాలు
  • ఎండ ఎక్కువ ఉందని ప్రజలు నీడచాటుకు వెళ్లారన్న మేయర్ రామయ్య
  • కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
కొన్ని వార్తాపత్రికలకు చెందిన విలేకరులను ఉద్దేశించి కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ మంత్రులు చేపట్టిన 'సామాజిక న్యాయభేరి' బస్సు యాత్ర కర్నూలుకు వచ్చినప్పుడు... మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉందని ప్రజలు నీడ చాటుకు వెళితే... సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని హెచ్చరించారు. బీవై రామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్నూలులో చర్చనీయాంశంగా మారాయి.
Kurnool
Mayor
BY Ramaiah
Journalists
Warning

More Telugu News