Anitha: జైల్లో ప్లేట్లు కడుక్కుంటూ బతకాల్సిందే: విజయసాయిరెడ్డిపై అనిత ఫైర్

Anitha fires on Vijayasai Reddy
షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నాయకురాలు అనిత కౌంటర్ ఇచ్చారు. బ్లూ మీడియా రాతలతోను, లోటస్ పాండ్ ఎడిట్ లతోను అధికారం నిలబడదని ఆమె అన్నారు. ప్రజలు మీ నైజాన్ని గ్రహించారని చెప్పారు. మోదీ కాళ్లు, కేసీఆర్ కాళ్లు, కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కి ఎన్నికల్లో గెలిచారని ఎద్దేవా చేశారు. నవ రత్నాల పేరుతో నవ మోసాలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏ1, ఏ2 చంచల్ గూడ జైల్లో ప్లేట్లు కడుక్కుంటూ బతకాల్సిందేనని చెప్పారు. 

మీవి మార్ఫింగ్ బతుకులని, అడ్డంగా దొరికాక కూడా బుకాయించే బతుకులని అనిత అన్నారు. మీ బతుకంతా విధ్వంసమేనని... ప్రజావేదికతో మొదలైన విధ్వంసం మూడేళ్లుగా కొనసాగుతోందని మండిపడ్డారు. తాము నిజంగా విధ్వంసం చేసే వాళ్లమే అయితే... మీరు ఊరూరా ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేసే వాళ్లు కాదని... ఎప్పుడో ఊరు వదిలేసి పారిపోయే వాళ్లని అన్నారు.
Go Back to Shorts
Anitha
Telugudesam
Vijayasai Reddy
YSRCP

More Telugu News